ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి రామ్మోహన్ నాయుడు పొగడ్తలతో ముంచెత్తారు. సీఎం చంద్రబాబు పనితీరు మరోసారి ప్రూవ్ అయ్యిందన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కోవడంలో సీఎం చంద్రబాబు తనకు తానే సాటి అని నిరూపించుకున్నారని తెలిపారు. తితిలీ తుఫాన్ సమయంలో బాబు విశేష సేవలు అందించారని గుర్తుచేశారు. ప్రతిపక్షాలు అనవసర విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. వరదలను కూడా రాజకీయ లబ్దికి వాడుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ పాలన చూసి ప్రజలు విసుగుచెంది బుద్ధి చెప్పారన్నారు. సోషల్ మీడియాలో సహాయ కార్యక్రమాలపై దుష్ప్రచారం చేస్తున్నారని... అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో మాట్లాడుతోందని... కేంద్రం ఎప్పటికప్పుడు కావాల్సిన సహకారం అందిస్తోందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.