ఉత్తర కోస్తాలో గురువారం అక్కడక్కడా భారీ వర్షాలు కురిశాయి. శుక్రవారం కోస్తా, సీమల్లో అనేకచోట్ల వర్షాలు, శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్రలో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. కాగా శుక్ర, శనివారాల్లో ఉత్తర కోస్తాపై ఎక్కువ ప్రభావం చూపుతుందని, మధ్య కోస్తాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు మాత్రమే కురుస్తాయని ఇస్రో వాతావరణ నిపుణుడు తెలిపారు.