విశాఖవాసులకు గుడ్ న్యూ్స్. విశాఖపట్నం విమానాశ్రయం నుంచి మరో నాలుగు కొత్త సర్వీసులు నడవనున్నాయి. ఇండిగో ఎయిర్‌లైన్స్ వైజాగ్ నుంచి నాలుగు విమాన సర్వీసులను నడపనుంది. ఆంధ్రప్రదేశ్ ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ కృషి వల ఇండిగో ఎయిర్‌లైన్స్ ఈ నిర్ణయం తీసుకుంది. నాలుగు సర్వీసులలో ఒకదాన్ని ఈ నెలలోనే ప్రారంభించనున్నారు. మిగతా మూడు సర్వీసులను అక్టోబర్ నెలలో ప్రారంభించనున్నారు. సెప్టె్ంబర్ 21న ఉదయం 9 గంటలకు విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు కొత్త విమాన సర్వీసు ప్రారంభం కానుంది. అలాగే అక్టోబర్ 27న విశాఖ- విజయవాడ, విశాఖ- హైదరాబాద్ సర్వీస్ ప్రారంభం కానుంది. విశాఖపట్నం- విజయవాడ మధ్య ప్రారంభమయ్యే సర్వీసు ఉదయం 9 గంటల 15 నిమిషాలకు స్టార్ట్ కానుంది.
ఇక వైజాగ్- హైదరాబాద్ మధ్య అక్టోబర్ 27న ప్రారంభమయ్యే సర్వీసు మధ్యాహ్నం ఒంటి గంటకు విశాఖ విమానాశ్రయం నుంచి బయల్దేరనుందని అధికారులు తెలిపారు. వీటితో పాటుగా విశాఖపట్నం- అహ్మదాబాద్ మధ్య వారానికి మూడు రోజులపాటు కొత్త సర్వీసును కూడా అక్టోబర్ నెలలో ప్రారంభించనున్నారు. ఇక అధికారుల నిర్ణయం పట్ల స్థానికులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ నుంచి విజయవాడకు, హైదరాబాద్ మధ్య నిత్యం రాకపోకలు సాగుతుంటాయి. ఈ క్రమంలోనే విశాఖ నుంచి నూతన సర్వీసులు ప్రారంభించడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు విశాఖపట్నం విమానాశ్రయంలో ఇటీవలే నూతన సేవలు సైతం అందుబాటులోకి వచ్చాయి. డిజీ సేవలను విశాఖ ఎయిర్‌పోర్టులో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఇటీవల ప్రారంభించారు. విశాఖతో పాటుగా రాంచీ, భువనేశ్వర్, ఇండోర్, గోవా, పట్నా, రాయ్‌పూర్, కోయంబత్తూరు సహా 9 చోట్ల డీజీ సేవలను కేంద్ర మంత్రి ప్రారంభించారు. వీటితో కలిపి దేశవ్యాప్తంగా ఉన్న 24 విమానాశ్రయాల్లో డీజీ యాత్ర సేవలు అందుబాటులోకి వచ్చినట్లు కేంద్రం తెలిపింది. ఇక ఈ సేవలు అందుబాటులోకి రావటం ద్వారా ప్రయాణికులు విమానాశ్రయంలోకి సులభంగా ప్రవేశించేందుకు వీలవుతుంది. ఫేసియల్ రికగ్నిషన్ ద్వారా ఈ యాప్ పనిచేస్తుంది. దీనిని ఇప్పటి వరకూ మూడు కోట్ల మంది విమాన ప్రయాణికులు వినియోగించుకున్నారు.