ఒక యువతి రైలు ప్రయాణంలో ఉండగా.. తనకు రిజర్వేషన్ టికెట్ కావాలని ఆమె ట్రైన్ టిటిని కోరింది. అయితే ఆ టిటి.. ఆ యువతిని తనతో పాటు రావాలని నడుస్తున్న ట్రైన్ లో టాయిలెట్ వరకు తీసుకెళ్లాడు.కానీ అక్కడ వెళ్లాక ఆమెపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడని తెలిసింది. ఈ షాకింగ్ ఘటన బిహార్ రాష్ట్రంలో జరిగింది.వివరాల్లోకి వెళితే.. బిహార్ రాజధాని పట్నా నుంచి ధన్ బాద్ కు వెళ్లే గంగా దామోదర్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో ప్రయాణించేందుకు ఒక యువతి ఎక్కింది. అయితే ఆమె వద్ద రిజర్వేషన్ టికెట్ లేదు. అందుకే జెనెరల్ టికెట్ తీసుకొని స్లీపర్ క్లాస్ లో ఎక్కింది. S-6 బోగీలోని ఒక బెర్త్ లో ఆ యువతి కూర్చొని టిటి అధికారి వస్తే.. తనకు స్లీపర్ క్లాసులో ఒక కన్‌ఫర్మ్ బెర్త్ కావాలని పేమెంట్ చేస్తానని అడిగింది.
అయితే ఆ టిటి అధికారి ఆమె వైపు తదేకంగా చూసి.. ‘అక్కడే కూర్చొని ఉండు.. టికెట్స్ చెక్ చేసి వస్తాను’ అని చెప్పి వెళ్లిపోయాడు. కాసేపు తరువాత తిరిగి వచ్చి తన వెంట రావాలని స్లీపర్ బెర్త్ చూపిస్తానని ఆ యువతిని తీసుకెళ్లాడు. అలా బోగీ చివరి వరకు ఆ యువతి టిటి ఆఫీసర్ వెంట వెళ్లింది. ఆ టిటి ఆఫీసర్.. యువతిని బోగీ చివరన ఉండే టాయిలెట్ వరకు తీసుకెళ్లి.. అక్కడ తలుపు తీసి ఆ యువతిని లోపలికి ఒక్కసారిగా తోశాడు. టాయిలెట్ లోపల యువతిని బలపూర్వకంగా పట్టుకొని ఆమెపై అత్యాచారం చేయబోయాడు. వారిద్దరి మధ్య తోపులాట జరిగిన క్రమంలో ఆ యువతి టిటి అధికారిని తోసేసి అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయింది.
ఆ తరువాత ట్రైన్ లో డ్యూటీ చేస్తున్న ఎస్కార్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆ టిటి అధికారిని అరెస్టు చేశారు. అయితే ఆ టిటి ఆఫీసర్ మాత్రం తన తప్పూ ఏమీ లేదని.. ఆ యువతి వద్ద టికెట్ లేదని ఫైన్ కట్టమని అడిగితే తనతో గొడవ పడి వెళ్లిపోయిందని ఎదురుగా ఆరోపణలు చేశాడు. ఈ అంశంపై పోలీసులు విచారణ చేస్తున్నారు.