చిలగడదుంప దీనినే చాలామంది స్వీట్ పొటాటో అలాగే గంజిగడ్డ అని కూడా పిలుస్తూ ఉంటారు. చాలామంది వీటిని తినడానికి అసలు ఇష్టపడరు. కొంతమంది మాత్రం పచ్చిగా తింటే మరికొందరు ఉడకబెట్టుకుని తింటూ ఉంటారు.చిలగడదుంపల వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చని చెబుతున్నారు. ఎందుకంటే వీటిలో ఉండే పోషకాలు మనల్ని ఎన్నో వ్యాధుల నుంచి కూడా రక్షిస్తాయట. ముఖ్యంగా వీటిని చలికాలంలో తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు అని చెబుతున్నారు.
చిలగడదుంపలో ఫైబర్, మినరల్స్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎన్నో వ్యాధులను దూరం చేస్తాయి. చిలగడదుంపలను మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..చిలగడదుంపలో ఫైబర్, పొటాషియం లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. వీటిని తింటే గుండె జబ్బుల ప్రమాదం తక్కువగా ఉంటుంది. ఫైబర్ మీ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడుతుంది. దీంతో ఆటోమెటిక్ గా మంచి కొలెస్ట్రాల్ పరిమాణం పెరుగుతుంది. మంచి కొలెస్ట్రాల్ శరీరం నుంచి ధమనులలో నిల్వ చేసిన విషాన్ని కాలేయానికి తీసుకువెళుతుంది. అక్కడ నుంచి అవి శరీరం నుంచి ఫిల్టర్ చేయబడతాయి.
అదేవిధంగా చిలగడదుంపలలో ఫైబర్ కంటెంట్ మెండుగా ఉంటుంది. ఇది మన జీర్ణక్రియకు చాలా అవసరం. దీన్ని తినడం వల్ల పేగుల్లో ఆహారం సులభంగా కదులుతుంది. పోషకాల శోషణ కూడా సులభతరం అవుతుందని, మలబద్ధకం సమస్య కూడా తగ్గిపోతుందని చెబుతున్నారు. చిలగడదుంపలు బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయట. వీటిలో ఉండే ఫైబర్ బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడంలో ఎంతో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుందని చెబుతున్నారు. అందుకే దీనిని మీ ఆహారంలో చేర్చడం వల్ల మీరు బరువు తగ్గే ప్రయాణం సులువు అవుతుందని చెబుతున్నారు. చిలగడదుంపల్లో ఉండే ఫైబర్ నెమ్మదిగా జీర్ణమవుతుందట.
అలాగే మీ కడుపును ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. దీని వల్ల మీరు అతిగా తినలేరు. దాంతో బరువు పెరిగే అవకాశాలు కూడా ఉండవని చెబుతున్నారు. చిలగడదుంపలో పొటాషియం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది రక్తపోటును నిర్వహించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటే గుండె జబ్బులు, మధుమేహం, స్ట్రోక్ వంటి ప్రమాదకర వ్యాధులు వచ్చే అవకాశం తగ్గుతుంది. అందుకే ఈ తీపి బంగాళాదుంపలను మీ ఆహారంలో చేర్చడం ప్రయోజనకరంగా ఉంటుందని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.