కోల్‌కతాలో డాక్టర్ పై అత్యాచారం-హత్య ఘటనపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరిగింది. ఈ మేరకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఘటనకు నిరసనగా వైద్యులు చేపట్టిన సమ్మె కారణంగా 23 మంది మృతి చెందారని తెలిపారు. ఈ ఘటనపై వైద్యులు గత నెల రోజులుగా ఆందోళనలు చేస్తున్నారన్నారు. ఈ నిరసనలతో ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయాడని TMC ఎంపీ అభిషేక్ బెనర్జీ శుక్రవారం చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa