పారాలింపిక్స్-2024లో ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన విజేతలకు వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. పారాలింపిక్స్-2024లో క్రీడాకారులు కనబరిచిన ప్రతిభ, అంకితభావం విశేషమైనది..స్ఫూర్తిదాయకం. పారాలింపిక్స్‌లో పాల్గొన్న వారందరికీ మరియు పతక విజేతలకు అభినందనలు, హ్యాట్సాఫ్! దేశం మిమ్మల్ని చూసి గర్విస్తోంది అంటూ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa