అరెస్టయిన మాజీ లోక్‌సభ సభ్యుడు నందిగం సురేష్‌ను వైయస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించనున్నారు. 11వ తేదీ బుధవారం ఉదయం 11 గంటలకు ఆయన గుంటూరు జైలుకు వెళ్లి నందిగం సురేష్‌ను కలుసుకుంటారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యథేచ్ఛగా వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు, అక్రమ కేసులను కొనసాగిస్తోంది. దీంట్లో భాగంగా నందిగం సురేష్‌ను కూడా అరెస్టు చేశారు. మూడేళ్ల క్రితం అప్పటి సీఎం వైయస్ జగన్‌గారిపై టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి తీవ్ర పదజాలంతో దూషణల నేపథ్యంలో.. ఆనాడు టీడీపీ కార్యాలయం వద్ద చోటు చేసుకున్న ఘటనల కేసులో కొందరు వైయస్ఆర్సీపీ నాయకులపై కేసులు నమోదయ్యాయి. మూడేళ్ల క్రితం ఈ ఘటన జరిగినా ఇప్పుడు నందిగం సురేష్‌తో పాటు, మరికొందరు నాయకుల్ని ప్రభుత్వం ముద్దాయిలుగా చేసింది.