ఏపీని వరుణుడు ఇప్పట్లో వదిలేలా లేడు. మరో అల్పపీడన రాష్ట్రం వైపు దూసుకొస్తుంది. ఈ నెల 20-22 మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. 27 నాటికి ఇది తీరం దాటనున్నట్లు తెలుస్తోంది. ఇది ఉత్తరాంధ్రకు దగ్గరగా వచ్చి.. ఆ తర్వాత ఒడిశా వైపు కదిలే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది.
వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే తుపాను కూడా ఏర్పడవచ్చని అధికారులు తెలిపారు. ఏపీపై ఎంత ప్రభావం చూపుతుందనేది వారం రోజుల్లో స్పష్టత వస్తుందని అధికారులు పేర్కొన్నారు.