టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నిందితుడు, వైసీపీ నేత దేవినేని అవినాశ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలు దేవినేని అవినాశ్‌తో పాటు లేళ్ల అప్పిరెడ్డి, నందిగం సురేశ్, తలశిల రఘురామ్ తదితరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో తమను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ అవినాశ్‌తో పాటు మరికొందరు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో సోమవారం దేవినేని అవినాశ్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు.