విజయవాడ 64వ డివిజన్ కండ్రిక కాలనీ వాసులకు టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్, ఆయన మిత్రబృందం రూ.50 లక్షల విలువైన వస్తు సామాగ్రిని సీఎం ద్వారా అందజేశారు. కాకులపాడుకు చెందిన చలసాని పూర్ణబ్రహ్మయ్య దంపతులు చంద్రబాబును విజయవాడలో సోమవారం కలసి ఆశీర్వదించడంతో పాటు వరద బాధితులకు తమ వంతు సహకారంగా రూ.5 లక్షల విరాళాన్ని అందజేశారు.