వరద బాధితుల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం పూర్తి ఏర్పాట్లు చేసిందని మంత్రి నారాయణ తెలిపారు. వరద బాధితులకు నిత్యావసరాలతో కూడిన ఆహార కిట్లు అందిస్తున్నామని, లక్షల కొద్దీ ఆహార ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. వరద బాధితులకు పంపిణీ చేసేందుకు ప్రత్యేకంగా 5 రకాల తినుబండారాలు ఆహార ప్యాకెట్లలో పెట్టినట్లు తెలిపారు. ఒక్కో ప్యాకెట్‌లో 6 ఆపిల్స్, 6 బిస్కట్ ప్యాకెట్లు, 2 లీటర్ల పాల ప్యాకెట్లు, 3 నూడిల్స్ ప్యాకెట్లు, 2 లీటర్ల వాటర్ బాటిల్స్ ఉంటాయని, వాటిని ప్రతి ఒక్క వరద బాధిత కుటుంబానికీ అందజేసేలా ఏర్పాట్లు చేసినట్లు మంత్రి చెప్పారు. వాటితోపాటు నిత్యావసరాల సరకుల పంపిణీ ప్రారంభిస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు.