జగ్గంపేట మండలంలో ఏలేరు వరద గ్రామాలను ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పరిశీలించారు. పునరావాస కేంద్రాలకు వెళ్లాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పునరావాస కేంద్రాల్లో ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు జంపన సీతారామచంద్రవర్మ, కొత్త కొండబాబు, అడబాల వెంకటేశ్వరరావు, గంగిరెడ్ల దొరబాబు, మంచికంటి శ్రీను పాల్గొన్నారు. ఏలే రు ముంపు ప్రాంతాలైన తామరాడ, రామచంద్రపురం, వీరవరం, రాజుపాలెం, ముక్కోల్లు, గెద్దనాపల్లి, భూపాలపట్నం, ఎస్.తిమ్మాపురం, శృంగారాయునిపాలెంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యో తులనవీన్ పర్యటించి ప్రజలకు ధైర్యం చెప్పారు.