వరద ప్రాంతాలలోని మారుమూల ప్రాంతాలకు సహాయం అందేలా చూడాలని షర్మిల అన్నారు. ఆమె మాట్లాడుతూ.... చిన్న పిల్లల దగ్గర నుంచి చంద్రబాబు డబ్బు తీసుకోడం కాదని.. బీజేపీ నుంచి చంద్రబాబు డబ్బులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఏపీ ఎంపీల ద్వారా ప్రధాని అయిన మోదీని ఈ విషయంలో నిలదీయాలని అన్నారు. పిల్లల దగ్గర ఎందుకు.. మోదీ నుంచి రూ. 10 వేల కోట్లు సీఎం చంద్రబాబు తేవాలని వైఎస్ షర్మిల కోరారు.