ఏపీలో గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ధవళేశ్వరం వద్ద భారీగా వరద వచ్చి చేరుతోంది. ప్రస్తుతం నీటిమట్టం 13.75 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరికను వాతావరణ శాఖ అధికారులు జారీ చేశారు.
13 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వదులుతున్నారు. దీంతో నది పరీవాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. గోదావరి ప్రవాహ ఉధృతి దృష్ట్యా గణేష్ విగ్రహాల నిమజ్జనం రానున్న 48 గంటల పాటు నిర్వహించకూడదని తెలిపారు.