పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై పెట్రోలియం శాఖ కార్యదర్శి పంకజ్ జైన్ సంకేతాలు ఇచ్చారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం 72 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇలాగే కొనసాగితే భారత్‌లో చమురు ధరలు తగ్గే అవకాశాలు ఉంటాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని పంకజ్ జైన్ కూడా వెల్లడించారు.అంతర్జాతీయంగా చమురు ధరలు ఇదేస్థాయిలో కొనసాగితే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించే అవకాశం ఉంటుందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. క్రూడాయిల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్లో మూడేళ్ల కనిష్టానికి చేరుకున్నాయి. 2021 డిసెంబర్ తర్వాత బ్యారెల్ చమురు ధర రెండు రోజుల క్రితం 70 డాలర్ల దిగువకు చేరింది.రష్యా నుంచి తక్కువ ధరకు చమురు వస్తోందని, కాబట్టి అక్కటి నుంచి వీలైనంత ఎక్కువగా దిగుమతి చేసుకోవాలని భారత్, ప్రభుత్వరంగ చమురు కంపెనీలు భావిస్తున్నాయని పంకజ్ జైన్ వెల్లడించారు.