కౌమార దశలో ఆడపిల్లల్లో రక్తహీనత తలెత్తకుండా పోషణ్ ప్లస్ కార్యక్ర మంలో భాగంగా అక్టోబరు 1నుంచి మునగాకు పొడి పంపిణీ చేయాలని రాజమహేంద్రవరం కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు. ఎనీమియా లోపం వల్ల రక్తహీనత కలిగి కళ్లు తిరిగి పడిపోవడం వంటివి జరుగుతుంటాయన్నారు. మనం తీసుకునే ఆహారంలో ఐరన్ పోషకాలు అందుతున్నాయో లేదా నిర్ధారించుకోవాలన్నారు. జిల్లాలో తొలివిడతగా 2700 మంది హాస్టల్ విద్యార్థినులకు మునగాకు పొడి అందచేసి మంచి ఫలితాలు సాధించామన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ వసతి గృహాల్లో సుమారు 3 వేల మంది కౌమార దశలో ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ ఎన్.వసుంధర, డీఎంహెచ్‌వో డాక్టర్ కే.వెంకటేశ్వరరావు, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కేఎన్.జ్యోతి, జిల్లా బీసీ సంక్షేమ అధికారి బి.శశాంక, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఎమ్.సందీప్ పాల్గొన్నారు.