ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలీస్ విచారణకి మాజీ ఎంపీ నందిగం సురేష్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 13, 2024, 07:08 PM

టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వైసీపీ నేత, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ మంగళగిరి కోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో రిమాండ్ ఖైదీగా ఉన్న సురేష్‌ను ఈ నెల 15 నుంచి 17 వరకు మధ్యాహ్నం 1 వరకు జైల్లోనే విచారించనున్నారు. 2021లో మంగళగిరిలోని టీడీపీ కార్యాలయం దాడులు జరిగాయి. సురేష్.. ప్రస్తుతం గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మంగళగిరి గ్రామీణ పీఎస్‌లో సురేష్‌ను విచారించేందుకు కోర్టు అనుమతించింది. ఈ నెల 5వ తేదీన మంగళగిరి రూరల్ పోలీసులు సురేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆయన విచారణకు సహకరించకపోవడంతో పోలీసులు మంగళగిరి కోర్టును ఆశ్రయించారు. 8 రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com