చిత్తూరు జిల్లా, మొగలి ఘాట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం గురించి సీఎం చంద్రబాబు అధికారులను ఆరా తీశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. సహాయక చర్యలు, బాధితులకు అందుతున్న వైద్య సాయంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని భరోసానిచ్చారు.