అక్టోబర్ 2న 'స్వచ్ఛ భారత్ దివస్' నిర్వహించుకుంటున్న నేపథ్యంలో ఈ నెల 17 నుంచి వచ్చే నెల ఒకటో తేదీ వరకు 'స్వచ్ఛతా హీ సేవా' పేరుతో కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ శివ శంకర్ లోతేటి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని బోర్డు రూమ్ నుంచి రెవెన్యూ డివిజనల్ అధికారులు, మండల అధికారులతో వీడియో కాన్వరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి సమీక్ష సమావేశం నిర్వహించారు.