ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాకినాడతో సీతాారాం ఏచూరికి అనుబంధం.. అప్పట్లో ఏకంగా రూ.10లక్షలు సాయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 13, 2024, 07:53 PM

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. కొంతకాలంగా న్యుమోనియా తరహా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌ సమస్యతో బాధపడుతున్న ఆయన.. ఆగస్టు 19న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేశారు. డాక్టర్లు సీతారాంకు ఆక్సిజన్‌ సపోర్ట్‌తో చికిత్స అందిస్తూ వచ్చినా ఫలితం లేకుండాపోయింది. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం 3.03 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఏచూరి పార్థివ దేహాన్ని వైద్య విద్యార్థులకు బోధన, పరిశోధన అవసరాల కోసం ఎయిమ్స్‌కి దానం చేయాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు.


సీతారాం ఏచూరికి కాకినాడతో కూడా అనుబంధం ఉంది. ఆయన తల్లిదండ్రులది కాకినాడ కాగా.. ఉద్యోగ రీత్యా వారు దేశంలోని పలు ప్రాంతాల్లో నివాసం ఉన్నారు. సీతారాం తండ్రి సర్వేశ్వర సోమయాజులు ఉద్యోగ విరమణ తర్వాత కాకినాడలో స్థిరపడ్డారు. సోమయాజులు కాకినాడలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో సీతారాం ఆయనకు సపర్యలు చేశారు.. అయితే సోమయాజులు 1999 అక్టోబర్‌ 11న కన్నుమూశారు. ఏచూరి టవర్స్ పేరుతో.. కాకినాడలోని రామారావుపేటలో ఓ భవనం, పక్కనే మరో నివాసం ఉండేవి. మూడేళ్ల క్రితం వరకు సీతారాం తల్లి అక్కడే నివాసంలో ఉండేవారు.. కానీ ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీకి తీసుకెళ్లారు. ఆమె కూడా 2021 సెప్టెంబర్‌లో కన్నుమూశారు.


సీతారాం ఏచూరి తల్లి కల్పకం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన మోహన్‌ కందాకు సోదరి. కల్పకం దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌ శిష్యురాలిగా పేరు తెచ్చుకున్నారు.. ఆమె ఎంఏ, పీహెచ్‌డీ పూర్తి చేసి, కాకినాడలోనే ఆలిండియా ఉమెన్‌ కాన్ఫరెన్స్‌ను ప్రారంభించి మహిళాభ్యున్నతికి కోసం పనిచేశారు. అయితే ఏచూరి కాకినాడతో ఉన్న అనుబంధంతో.. ఆయన రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన సమయంలో కాకినాడ గాంధీభవన్‌లో గ్రంథాలయం నిర్మాణానికి ఎంపీ నిధుల్లోంచి రూ.10 లక్షలు సాయం చేశారు.


సీతారాం ఏచూరి విద్యార్థి నాయకుడి స్థాయి నుంచి సీపీఎంలో ప్రస్థానం ప్రారంభించారు.. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగారు. సీపీఎం పార్టీ జాతీయ నాయకత్వ బాధ్యతల్లో ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో కీలక సమావేశాలకు హాజరయ్యేవారు. అంతేకాదు సీతారాం ఏచూరి పుచ్చలపల్లి సుందరయ్య తర్వాత సీపీఎంకు నేతృత్వం వహించిన రెండో తెలుగువారిగా పేరుపొందారు. అయితే ఆయన ఆ పదవిలో ఉండగానే తుదిశ్వాస తొలి నాయకుడిగా మిగిలారు.


సీతారాం ఏచూరి 1952 ఆగస్టు 12న చెన్నైలో జన్మించారు. తండ్రి సర్వేశ్వర సోమయాజులు ఏచూరి ఆర్టీసీలో ఇంజినీర్‌. తల్లి కల్పకం ఏచూరి ప్రభుత్వాధికారిణి. సీతారాం బాల్యం హైదరాబాద్‌‌లో నడిచింది.. అబిడ్స్‌లోని ఆల్‌సెయింట్స్‌ పాఠశాలలో మెట్రిక్యులేషన్, నిజాం కళాశాలలో పీయూసీ పూర్తి చేశారు. ఆ తర్వాత ఆయన ఢిల్లీకి వెళ్లారు.. అదే ఆయన రాజకీయ జీవితాన్ని మలుపుతిప్పింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com