ముఖ్యమంత్రి చంద్రబాబు గారి పిలుపుతో వరద బాధితుల సహాయ నిధికి దాతలు విరాళాలు అందిస్తున్నారు. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ నేతృత్వంలో స్వచ్ఛందంగా ప్రజలు, దాతలు, వివిధ సంఘాలు, వ్యాపార సంస్థలు, విద్యాసంస్థల నుంచి సేకరించిన విరాళం రూ.1.63 కోట్లు, గుంటూరుకు చెందిన సిమ్స్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ ఎండీ, సెక్రటరీ కరస్పాండెంట్ భీమనాథం భరత్ రెడ్డి, శివ శిరీష రూ.10 లక్షలు, గుంటూరుకు చెందిన ఆరుషి ఇన్ ఫ్రా అండ్ డెవలపర్స్ అధినేత యెండ్లూరి సత్యనారాయణ రూ.1లక్ష, గుంటూరు మాజీ డిప్యూటీ మేయర్ షేక్ గౌస్ రూ.50వేలు, విజయవాడకు చెందిన ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్ మెంట్ అసోసియేషన్(ఏపీపీయూఎస్ఎంఏ) ప్రతినిధులు రూ.10 లక్షలు, గుంటూరుకు చెందిన పీఎస్ఆర్ ఇన్ ఫ్రా అధినేత బి.శ్రీనివాసరావు రూ.5 లక్షలు, విజయవాడకు చెందిన మొక్కపాటి సత్యనారాయణ రూ.2,42,764, కర్నూలుకు చెందిన పి.రాజశేఖర్ రూ.1లక్ష, మంగళగిరికి చెందిన దివి పిచ్చేశ్వరరావు రూ.50వేలు అందించారు. వరద బాధితులకు అండగా నిలిచిన దాతలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.