కళ్యాణదుర్గం పట్టణంలో కొల్లాపురమ్మగుడి వద్ద ఉన్న కాలనీవాసులు తాగునీటి కోసం మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కి శనివారం నిరసన తెలిపారు. మహిళలు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నాము.
కాలనీలలో తాగునీటి సమస్య పరిష్కరించేంతవరకు మా నిరసనలు ఆగవన్నారు. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోయి ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు కలగజేసుకొని వారికి నచ్చజెప్పి నిరసనను విరమింప చేశారు.