శ్రీకాకుళం జిల్లా, సరుబుజ్జిలి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఆనుకొని ఉన్న నందికొండ గ్రామంలో జ్వరా లు హడలెత్తిస్తున్నాయి. శుక్రవారం గ్రామంలోని ఒక వీధికి చెందిన జ్వర పీడితుల వివరాలు స్థానిక వైద్యాధికారి సంతోష్‌కుమార్ ఆధ్వర్యంలో వైద్య సేవలు అం దించారు. ఇదే గ్రామానికి చెందిన పట్నాన వేణుశ్రీ ఎల్‌ఎన్ పేట వసతిగృహంలో 8వ తరగతి చదువుతుంది. ఇటీవల స్వగ్రామానికి వచ్చి జ్వరం బారిన పడగా.. స్థానిక పీహెచ్‌సీలో వైద్యసేవలకు వెళ్లగా.. మెరుగైన చికిత్స కోసం జొన్నవలస 30 పడకల ఆసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడ రక్త పరీక్షలు నిర్వహించగా డెంగ్యూ లక్షణాలు ఉన్నట్టు గుర్తించి శ్రీకాకుళం రిమ్స్‌కు పంపించారు. అక్కడి వైద్యులు ఆ బాలికకు డెంగ్యూ ఉన్నట్టు నిర్థారణ చేసి తిరిగి జొన్నవలస ఆసుపత్రిలోనే వైద్య సేవలు అందించాలని పంపించారు. అలాగే నందికొండ గ్రామానికి చెందిన పెరుమాళ్ల అప్పారావు, చెల్లమ్మ దంపతులు కూడా జ్వరం బారిన పడి శుక్రవారం పీహెచ్‌సీకి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. గ్రామానికి చెందిన సుమారు 25 మంది జ్వరాలు బారిన పడినట్టు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్య బృంద సభ్యులు తెలుపుతూ వారికి అవసరమైన వైద్యసేవలు అందించడం జరుగుతుందన్నారు. నందికొండ గ్రామంలో పర్యటించిన వైద్య బృందంతో స్థానిక ఎంపీడీవో పీవీవీ మురళీమోహన్ కుమార్, ఈవోపీఆర్‌డీ ఆనందరావు పాల్గొన్నారు.