ఇచ్ఛాపురం పరిధిలోని ఈదుపురం గ్రామానికి చెందిన దల్లి గురు మూర్తి(39) కిడ్నీ వ్యాధితో బాధపడుతూ మృతి చెందాడు. గురుమూర్తికి రెండు కిడ్నీలు పాడవడంతో కొన్నేళ్లుగా డయాలసిస్ చేయించుకుంటున్నాడు. శుక్రవారం వైజాగ్లో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందాడు. గురుమూర్తికి భార్య మాణిక్యం, ఇద్దరు కుమారైలు గీత, శ్రావణి, కుమారుడు తేజ ఉన్నారు. గురుమూర్తి మృతితో గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి.