పొందూరు పరిధిలోని తాడివలస గ్రామంలో ఏర్పాటుచేస్తున్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను విద్యుత్‌శాఖ సిబ్బంది శుక్రవారం పోలీసుల బందోబస్తు మధ్య ఏర్పాటు చేశారు. వివరాల్లోకి వెళితే.. గ్రామంలో లోఓల్టేజీ సమస్య రావడంతో సర్పంచ్ టి.మనెమ్మ విజ్ఞప్తి చేయడంతో ఎమ్మెల్యే కూన రవికుమార్ ట్రాన్స్ఫార్మర్ను మంజూరు చేయించారు. పంచాయతీ తీర్మానంతో గ్రామంలో చెరువుగట్టుపై ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు ఏఈ దుర్గాప్రసాద్ పనులు ప్రారంభించగా.. వైసీపీ నాయకులు కొందరు పనులను అడ్డుకున్నారు. దీంతో సర్పంచ్ సూచనతో పోలీసులకు ఫిర్యాదు చేశామని వారి సహకారంతో పనులు చేసినట్టు ఏఈ తెలిపారు.