శ్రీకాకుళం నగరంలో కళాశాలలు, పాఠశాలల ప్రాంతాల్లో కొంత మంది యువత ఆకతాయి చేస్టలకు పాల్పడుతున్నట్టు గుర్తించామని, అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామని శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద అన్నారు. ఈ మేరకు స్థానిక ఉమెన్స్ కళాశాల ప్రాంతంలో శుక్రవారం సీఐ కె.పైడపునాయుడుతో కలిసి పర్యటిం చారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో డీఎస్పీ మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. కొంత మంది ఆకతాయిలు అల్లరి చేస్తున్నట్టు వారు చెప్పడంతో ఆ ప్రాంతంలో పోలీసు నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే మహిళా కళాశాల రోడ్డులో ట్రాఫిక్ సమస్య నెకొందని తరచూ ప్రమాదాలు జరుగుతున్నట్టు స్థానికులు చెప్పారు.