ఆపరేషన్ ఉప్పుటేరు పేరుతో కొల్లేరు ముంపు సమస్యను పరిష్కరిస్తామని రాష్ట్ర పౌర సమాచార, గృహ నిర్మాణశాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. కైకలూరు, మండవల్లి మండలాల్లోని కొల్లేరు ముంపు గ్రామాలను శుక్రవారం ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్, అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. పెంచికల మర్రు, పందిరిపల్లిగూడెం గ్రామస్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకు న్నారు. కొల్లేరుకు వరద ఎగువ నుంచి ఎక్కడికి వస్తుంది, పరిష్కారదిశగా చేపట్టాల్సిన చర్యలను ఎమ్మెల్యే కామినేని మంత్రికి వివరించారు. కొల్లేరు వరద నీటిలో బోటులో ప్రయాణం చేస్తూ పందిరిపల్లిగూడెంకు చేరుకు న్నారు. అక్కడ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రజలు ప్రభుత్వంపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయమని కొల్లేరు సమస్యకు శాశ్వత పరిష్కా రాన్ని అంది స్తామన్నారు. కొల్లేరు ముంపు సముద్రంలోనికి వెళ్లే ఉప్పుటేరు ఆక్రమణను తొలగించి ముంపు నివారణను చేపడతామన్నారు. కొల్లేరులోనికి డ్రెయిన్లను ఆధునికీకరణ చేసి రెగ్యులేటర్ నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. ముంపు బాధితులను అన్నివిధాలా ఆదుకుంటామాన్నారు. ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ ఉప్పుటేరుపై ఆక్రమణలు, రెగ్యులేటర్ నిర్మాణంపై ముఖ్య మంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లానని వాటి నిర్మాణానికి ప్రభుత్వం కృషి చేసేలా చూస్తానని భరోసా ఇచ్చారన్నారు. కొల్లేటి వరద ప్రవాహానికి అడ్డుగా ఉన్న ఉప్పుటేరును వెడల్పు చేసేందుకు కృషి చేస్తా మన్నారు. మండవల్లి మండలంలోని పెద్దఎడ్లగాడి వద్ద, మణుగులూరు కొల్లేరు ముంపు ప్రాంతాల్ని మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ వరద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. చావలిపాడు కాలనీని సందర్శించారు. గ్రామంలో అన్ని కుటుంబాలు ముంపు బారిన పడ్డారని, అయితే 20 కుటుంబాలకు మాత్రమే ప్రభుత్వం సహాయం అందిస్తున్నారని బాధితులు తెలపగా అందరికి సహాయ చర్యలు చేపడ తామని హామీ ఇచ్చారు. అటవీశాఖ డివిజనల్ అధికారి రవి శంకర్, ఆర్డీవో కాజావలీ, మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠలరావు, రాష్ట్ర వడ్డీసాధికారిక సమితి కన్వీనర్ బలే ఏసురాజు, జడ్పీటీసీ కురేళ్ళ బేబి, కూటమి నాయకులు పెన్మెత్స త్రినాథరాజు, బొమ్మనబోయిన విజయలక్ష్మీ, పూల రామచంద్రరావు, కొల్లి వర ప్రసాద్, కేకే బాబు, తోట లక్ష్మీ, బంకపల్లి సీతమ్మ, చాపరాల దుర్గాప్రసాద్, మండవల్లి తహసీల్దార్ గోపాల్, ఎంపీడీవో వెంకటరమణ, ఆనందబాబు పాల్గొన్నారు.