ఏలూరు నియోజకవర్గంలో వైసీపీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. నగర పాలక సంస్థ పాలక మండలిలో వైసీపీ ఖాళీ అవుతోంది. కొన్నిరోజుల క్రితం 20 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరగా శుక్రవారం బడేటి క్యాంపు కార్యాలయం లో ఎమ్మెల్యే బడేటి చంటి సమక్షంలో మరో ఐదుగురు కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. ఏలూరు నగర పాలక సంస్థ పాలక మండలిలో 50 మంది కార్పొరేటర్లు ఉండ గా 47 మంది వైసీపీ కార్పొరేటర్లలో ఇద్దరు ఎన్నికల ముందే టీడీపీలో చేరగా ఎన్నికల తర్వాత మరో 20 మంది, ప్రస్తుతం మరో ఐదుగురుతో కలిపి ఇప్పటి వర కు 27 మంది టీడీపీ గూటికి చేరారు. ఇంకా మిగిలిన కార్పొరేటర్లు కూడా టీడీపీ వైపు చూస్తున్నారు. భవిష్య త్తులో అదే జరిగితే పాలక మండలిలో వైసీపీ ఖాళీ అయ్యే అవకాశాలున్నాయి. ప్రవీణ్‌కుమార్–8వ డివిజన్, దారపు అనూష– 14వ డివిజన్, జె.సాంబశివరావు–23వ డివిజన్, సత్యవతి–42వ డివిజన్, జె.కనక రాజేశ్వరి– 43వ డివిజన్ శుక్రవారం ఎమ్మెల్యే చంటి సమక్షంలో టీడీపీలో చేరారు. అంతకు ముందు ఈ ఐదుగురు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావుకు రాజీనామా పత్రం పంపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లా డుతూ నగరాభివృద్ధికి సహకరించే ప్రజా ప్రతినిధులను పార్టీలో చేర్చుకుంటామన్నారు. టీడీపీలోకి రావడానికి మిగిలిన వైసీపీ కార్పొరేటర్లు క్యూ కడుతున్నారన్నారు. నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంతో కలిసి పని చేసి నగరాన్ని అభి వృద్ధి వైపు తీసుకెళ్తామన్నారు. మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, కోఅప్షన్ సభ్యులు పెదబాబు, టీడీపీ నేతలు పెద్దిబోయిన శివప్రసాద్, ఎంఆర్‌డీ బలరామ్, బొద్దాని శ్రీనివాస్, రెడ్డి నాగరాజు, మైబాబు పాల్గొన్నారు.