తన కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను, తన ఇంటితో సహ తన జన్మభూమి దెందులూరు గ్రామాభివృద్ధి, సంక్షేమానికి దానం చేసిన దాత, నేటితరానికి స్ఫూర్తి ప్రదాత అయిన మెటపర్తి రామచంద్రమ్మ (90) అనారోగ్యం తో హైదరాబాద్‌లో కన్ను మూశారు. ఆమె అంత్యక్రియలు హైదరబాద్‌లో శనివారం జరగనున్నాయి. కాగా ఆమె మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది. 1934లో దెందు లూరులో కొల్లిపర్ర కాశీ విశ్వనాథం, వర లక్ష్మమ్మ దంపతులకు ఆమె జన్మిం చారు. ఆమె అమెరికాలో డల్లాస్‌లో బిజినెస్ అడ్మిషన్‌లో గ్రాడ్యుయేషన్ చేశారు. ముంబై, హైదరాబాద్ సిండికేట్ బ్యాంక్‌లో డైరెక్టర్‌గా రీజనల్ ఆఫీ సర్‌గా, బ్రాంచి మేనేజర్‌గా పని చేశారు. తన గ్రామానికే చెందిన మెటపర్తి వెంకట సుబ్బారావుతో వివాహమైంది. వీరికి ముగ్గురు కుమార్తెలు, కుమ రుడు మెటపర్తి వెంకట్ ఉన్నారు. భర్త వెంకటసుబ్బారావు 2018లో మృతి చెందారు. కాగా తమ జన్మభూమి అభివృద్ధికి రామచంద్రమ్మ నడుం కట్టారు. దెందులూరులో తహసీల్దార్, ఎంపీ డీవో, విద్యాశాఖ, మీ సేవ, గ్రంథా లయం భవనాలతో పాటు జడ్పీ ఉన్నత పాఠశాల, పోలీస్ స్టేషన్, టీటీడీ కల్యాణ మండపం, దేవాలయాలు, మినరల్ వాటర్ ప్లాంట్, ఆస్పత్రికి స్థలాలతో పాటు భవనాలను అందించడమే కాకుండా పేదలకు దాదాపు వంద మందికి ఇళ్ల స్థలాలు అందించారు. దెందులూరులో ఉన్న తన ఇంటిని శిశు సంక్షేమ కార్యాలయం (బాల సదనం)కు దానం చేస్తూ 2023లో అప్పటి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్‌కు పత్రాలు అందించారు. దెందులూరు మండలంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 100 కోట్ల విలువైన ఆస్తులను రామచంద్రమ్మ దానం చేశారు. దెందులూరు అభివృద్ధికి, విద్య ,పేదరిక నిర్మూలనకు ఆమె భర్తతో కలసి కృషి చేసి వేలాది మందికి జీవితాన్ని అం దించారు. మరోవైపు కుమారుడు వెంకట్ సైతం విజయవాడ, గన్నవరం, హైదరాబాద్‌లో ఉన్న తమ విద్యాసంస్థల్లో పేద విద్యార్థులకు నామ మాత్ర పు ఫీజుకే విద్యను అందిస్తున్నారు. బ్లడ్ బ్యాంకులను నిర్వహిస్తున్నారు.