నరసాపురం పట్టణ శివారు మంగళగుంటపాలెం వద్ద కంపోస్టు యార్డుకు ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన భూమికి అవసరమైన సొమ్ము రూ.1.74 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. నాలుగేళ్ల క్రితం ప్రభుత్వం రైతుల నుంచి నాలుగు ఎకరాలు కొను గోలు చేసింది. ఆర్థిక సంఘం నిధులు రూ.1.71 కోట్లు పురపాలక సంఘం వద్ద ఉన్నాయి. ఇవి కాకుండా రూ.1.74 కోట్లు రైతులకు ఇవ్వాలి. గత ప్రభుత్వం రైతులకు సొమ్ము ఇవ్వకుండా కాలయాపన చేసింది. ఒప్పందం ప్రకారం ఈ నెలాఖరులోపు రైతులకు సొమ్ము చెల్లించాలి. లేని పక్షంలో కొత్తగా పెరిగే రిజిస్ర్టేషన్ విలువ ప్రకారం రైతులకు అదనంగా కోటి చెల్లించాలంటూ వస్తున్న కథనాలపై స్పందించిన ప్రభుత్వం నాలుగేళ్లుగా పెండింగ్ పెట్టిన ఈ మొత్తాన్ని విడుదల చేసింది. దీనిపై ఎమ్మెల్యే నాయకర్ మాట్లాడుతూ ఎన్నికల హామీల్లో భాగంగా ఆధికారంలోకి వచ్చిన మూడు నెలలకే కంపోస్టుయార్డు సమస్యను పరిష్కరించా మని చెప్పారు. శుక్రవారం సబ్ కలెక్టర్ కార్యాల యంలో ఆర్డీవో ఆంబరీష్‌తో ఆయన విలేకర్లతో మాట్లాడారు. గత ప్రభుత్వం రైతులకు పరిహారం ఇవ్వకుండా వేధింపులకు గురిచేసిన విషయాన్ని సీఎం, డిప్యూటి సీఎంలతోపాటు పురపాలక మంత్రి దృష్టికి తీసుకెళ్లే నిధుల విడుదల చేయించామన్నారు. త్వరలో గోదావరి ఒడ్డున్న కంపోస్టుయార్డును అక్కడికి తరలిస్తామన్నారు. ఆ గ్రామస్థులకు ఇబ్బందులకు లేకుండా చుట్టూ గోడ నిర్మించి వేసే చెత్తను ఎప్పటికప్పుడు రీసైకిల్ చేయిస్తామన్నారు. సమావేశంలో కమిషనర్ అంజయ్య పాల్గొన్నారు.