విజయవాడ వరద బాధితుల సహాయార్థం నెల వేతనాన్ని అందించేందుకు విజయనగరం జిల్లా, గరుగుబిల్లి మండలంలోని ఎంపీటీసీ సభ్యులు అంగీకరించారు. శనివారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ ఉరిటి రామారావు సమక్షంలో నాగూరు ఎంపీటీసీ సభ్యుడు ద్వారపురెడ్డి సత్యనారాయణ ప్రతిపాదన మేరకు ఒక నెల వేతనాన్ని సహాయార్థంగా అందించేందుకు ఎంపీటీసీ సభ్యులు అంగీకారం తెలిపారు. గ్రామస్థాయిలో విరాళాలు సేకరించి ముఖ్యమంత్రికి అందించనున్నట్టు సత్యనారాయణ, రావివలస ఎంపీటీసీ సభ్యుడు కోట భరత్‌కుమార్, సంతోషపురం సర్పంచ్ అంబటి తవిటినాయుడు తెలిపారు. ప్రభుత్వ శాఖల సిబ్బంది తమవంతు సహకారం అందించాలని కోరారు.