రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఎన్‌ఫోర్సుమెంటు బ్యూరోని ఎత్తివేసి ఎక్సైజ్‌శాఖను పునరుద్ధరిస్తూ తీసుకున్న నిర్ణయం హర్షణీయమని విజయనగరం జిల్లా ఎక్సైజ్ అధికారి ఏపీఎస్‌ఐ ఎంఎల్ డిపో మేనేజర్ ఎన్‌వీ రమణ అన్నారు. సెబ్‌ను తీసేసి, ఎక్సైజ్ శాఖ పునర్‌వ్యవస్థీకరణను హర్షిస్తూ, ము ఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2020 మే 15న ఎక్పైజ్‌శాఖను గత ప్రభుత్వం మార్చేసిందని, దీంతో ఎక్సైజ్ వ్యవస్థ ఆస్తవ్యస్తంగా తయారైందన్నారు. గత ప్రభుత్వ నిర్ణయాన్ని రద్దు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసిందని దీంతో ఎక్సైజ్ సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారన్నారు. ఎక్సైజ్ శాఖ పునర్‌వ్యవస్థీకరణకు సహాయ, సహకారాలు అందించిన జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్, తొమ్మిది మంది శాసనసభ్యులకు ధన్యవాదాలు తెలుపుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఈఎస్ డీవీజీ రాజు, ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్లు జగదీశ్వరరావు, హెచ్‌వీ ఎస్ ప్రసాద్, ఎస్‌ఐలు, హెచ్‌సీలు, పీసీలు, సిబ్బంది పాల్గొన్నారు.