ఒడిశా నుంచి ఇచ్ఛాపురం పురుషోత్తపురం చెక్‌పోస్టు మీదుగా గంజాయి రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. శనివారం ఇచ్ఛాపురం పట్టణ పోలీసు స్టేషన్లో సీఐ మీసా ల చిన్నమనాయుడు ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రం షిమోగ జిల్లా కడెకల్ గ్రామానికి చెందిన ఎన్.రాజేష్ గౌడో, హరేజ్ గ్రామానికి చెందిన జి.మధు(అలియాస్ మను)ఇద్దరూ ఒడిశాలో గంజాయి కొనుగోలు చేసి ఇచ్ఛాపురం వరకు ఓ ప్రైవేట్ బస్సులో చేరుకున్నారు. కర్ణాటక వెళ్లేందుకు బస్టాండ్ నుంచి బంగ్లా రోడ్ మీదుగా రైల్వే స్టేషన్‌కు కాలినడకన వెళ్తున్నారు. వారి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో తనిఖీలు చేపట్టారు. బ్యాగ్‌లో 11.070 కిలోల గంజాయి మూటలను గుర్తించి సీజ్ చేశారు. వారిద్దర్ని అరెస్టు చేసి, వారి నుంచి రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ చిన్నమనాయుడు సిబ్బంది పాల్గొన్నారు.