ఎస్ కోట మండలానికి అతి సమీపంలో గల అనంతగిరి మండలంలో గల సరియా జలపాతం లో గల్లంతయిన రెండు మృతదేహాలను పోలీసులు ఏపీ ఎస్ డి ఆర్ ఎఫ్ బృందం, అగ్రిమాపక సిబ్బంది సహాయంతో ఆదివారం వెలికి తీశారు. అనంతరం వెలికి తీసిన మృతదేహాలను కొండ దిగువ ప్రాంతానికి తీసుకువచ్చారు. అక్కడనుండి పోస్టుమార్టం నిమిత్తం ఎస్ కోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ కరక రాము తెలిపారు.