ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేసేందుకు కుట్ర జరుగుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటు జపం చేస్తున్నారని విమర్శించారు. చెప్పినవి ఏం చేశారని... మసిపూసి మారేడు చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటుపరం చేసే కుట్ర జరుగుతోందన్నారు. విశాఖ స్టిల్‌కు ప్రత్యేకంగా బొగ్గు గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ‘‘మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే విశాఖ స్టీల్‌ను ప్రైవేటుపరం కాకుండా చూడండి’’ అంటూ డిమాండ్ చేశారు. ఇండియాలో పెద్ద ఇమేజ్ ఉన్న స్టీల్ పరిశ్రమ విశాఖది అని చెప్పుకొచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం, మెడికల్ సిట్ల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా ఉద్యోగుల తీరు మారటం లేదన్నారు. ఉద్యోగులు అయ్యుండి సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేయటం హర్షించదగ్గ విషయం కాదన్నారు. ఇప్పటికే జగన్‌కు భజన చేసిన ముగ్గురు అధికారులు సస్పెండ్ అయ్యారని తెలిపారు. రేపు సీపీఐ ఆధ్వర్యంలో కొల్లేరు నుంచి బుడమేరు వరకు పరిశీలించి ఎల్లుండు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలుస్తామని సీపీఐ నేత రామకృష్ణ పేర్కొన్నారు.