ప్రకాశం బ్యారేజ్ వద్ద పడవల తొలగింపు కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. బోటును ముందుకు లాగే ప్రక్రియను ప్రస్తుతానికి సిబ్బంది నిలివేశారు. బ్యారేజీ వెనక ఉన్న సేఫ్టీ వాల్‌ను బోటు ఢీ కొడితే లాగడం కష్టమని నిపుణులు భావిస్తున్నారు. దీనితో నేడు కొత్త విధానం అమలు చేసేందుకు టీంలు సిద్ధమయ్యాయి. రెండు కార్గో బోట్లపై మూడు ఇనప గడ్డర్లను సిబ్బంది అమర్చింది. ఇనుప గడ్డర్లు కదలకుండా బోట్లకు వెల్డింగ్ చేశారు. నీటిలో మునిగి ఉన్న బోటుకు ఇనప గడ్డర్లకు రోప్ లాక్ చేసే విధంగా భారీ హుక్కులు ఏర్పాటు చేశారు. ఒక బోటును బ్యారేజ్ గేట్ల వైపు, మరో బోటును నది వైపు ఉంచి నీటిలో ఉన్న బోటుకు ఇనప రోప్ తగిలించి గడ్డర్లు లాక్ చేయాలని నిర్ణయించారు. ఆ బోట్ల సహాయంతో మునిగిన బోట్, గొల్లపూడి వైపు తీసుకెళ్లేందుకు ఇంజనీరింగ్ అధికారులు ప్రణాళికను సిద్ధం చేశారు. మరోవైపు నదిలో చిక్కుకున్న పడవ నీటిలో మునిగిపోవడంతో రెస్క్యూకి ఆటంకం కలిగింది. లాగే కోద్దీ రోప్, క్రేన్‌పై బరువు పెరుగుతోంది. గేట్లకు అడ్డం పడిన పడవను ప్రకాశం బ్యారేజీ వద్ద నుంచి పది అడుగులు ముందకు తీసుకువచ్చారు. అయితే, నీట మునిగిన పడవను కూడా బయటకు తీసేందుకు రెస్క్యూటీమ్ ప్రయత్నాలు చేస్తోంది. అండర్ వాటర్ ఆపరేషన్ ఇంకా పూర్తి కాలేదు. నీటిలో ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో బోటును పూర్తిగా కట్ చేయలేకపోతోంది డైవింగ్ టీమ్. ప్రవాహ ఉధృతి కూడా డైవర్లకు ఇబ్బందిగా మారింది. కట్ చేసిన రంద్రాల నుంచి పడవలోకి నీరు చేరుతోంది. దీంతో కటింగ్ ప్రక్రియను నిలిపివేసి.. భారీ రోప్ సహాయంతో ఒడ్డుకు లాగే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఇక్కడా చిక్కే ఎదురవుతోంది. పొజిషన్ నుంచి పడవ అస్సలు కదలడం లేదు. దీంతో నయా ప్లాన్‌కు అబ్బులు టీమ్ శ్రీకారం చుట్టారు.