నెల్లూరు జిల్లా అనంతసాగర మండలం సోమశిర జలాశయం పూర్తి నీటి సామర్థ్యం 78 టీఎంసీలు. సోమవారానికి జలాశయంలో 50 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు జలాశయం అధికారి దశరధరామిరెడ్డి తెలిపారు. వర్షాల కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి 14, 404 క్యూసెక్కుల కృష్ణా జలాలు వచ్చి చేరుతున్నాయి. కండలేరు జలాశయానికి 10, 000 క్యూసెక్కులు, పెన్నా డెల్టాకు 50 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 212 క్యూసెక్కుల నీరుఆవిరవుతుంది.