కావలి డిఎస్పి వెంకటరమణను బదిలీ చేశారు. ఆయన స్థానంలో కావలి నూతన డిఎస్పీగా శ్రీధర్ ను నియమించారు. కాగా డిఎస్పి వెంకటరమణ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో రిపోర్టు చేయాలని అధికారులు ఆదేశించారు. ఆయనకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకపోవడంతో వేటుపడినట్లు అయ్యింది. ఇటీవల జిల్లాలోని పలువురు ఉన్నత స్థాయి పోలీసులను బదిలీ చేస్తూ ఎస్పి కృష్ణ కాంత్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.