జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవ సందర్భంగా మంగళవారం కొరసవాడ గ్రామంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఆరోగ్య కార్యకర్త టి. లక్ష్మణరావు మాట్లాడుతూ నులిపురుగులు వలన రక్త హీనత కలుగు చేస్తుందని తెలిపారు. ఆల్బెండజోల్ మాత్రలు రెండు నుంచి 19 వయసు మద్య పిల్లలకు వినియోగించాలని తెలిపారు. నులిపురుగుల నివారణతో ఆరోగ్యమని చెప్పారు.