18 సెప్టెంబర్ 2024 బుధవారం మతపరమైన కోణం నుండి ప్రత్యేకమైనది. ఈ రోజున అనేక మతపరమైన కార్యక్రమాలు జరుగుతాయి. 2024 సంవత్సరంలో రెండవ, చివరి చంద్ర గ్రహణం సెప్టెంబర్ 18 న జరుగుతుంది.నవగ్రహాలలో సంపద, ఐశ్వర్యం, కీర్తికి కారకుడైన శుక్రుడు ఒక సంవత్సరం తర్వాత దాని స్వంత రాశి తులా రాశిలోకి ప్రవేశించాడు. శుక్రుడు తొమ్మిది గ్రహాలలో అత్యంత విలాసవంతమైన గ్రహం. తులా రాశిలో శుక్రుని సంచారం దేశంలో, ప్రపంచంలోని మానవ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. శుక్రుడు తులా రాశిలో సంచరించడం వల్ల ప్రజలకు మేలు జరుగుతుందని పండితులు తెలిపారు.
జ్యోతిష్య నిపుణులు చెప్పిన దాని ప్రకారం శుక్రుడు తన సొంత రాశిలో సంచరించడం శుభం లేదా ఆహ్లాదకరమైన సంకేతం. ఇది మానవ జీవితానికి మేలు చేస్తుంది. శుక్రుని సంచారం వైవాహిక జీవితంలో శుభ ఫలితాలను అందిస్తుంది. హార్మోన్ల సమస్యలతో సతమతమవుతున్న వారికి ఈ సమయంలో వాటి నుంచి విముక్తి కలుగుతుంది. ఆరోగ్యపరంగా మేలు చేస్తుంది. వ్యక్తిగత సంబంధాలకు ఇది మంచి సమయం. ప్రేమికులకు ఇది మంచి సమయం. శుక్రుడి సంచారం వల్ల భార్యాభర్తల మధ్య సంబంధాలు మెరుగుపడతాయి. సంపద పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు గడిస్తారు.
శుక్రుడు సెప్టెంబర్ 18, 2024 బుధవారం మధ్యాహ్నం 02:04 గంటలకు తులా రాశిలోకి ప్రవేశిస్తాడు. సొంత రాశిలో శుక్రుడి సంచారం వల్ల పవిత్రమైన శుభకరమైన మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది. పంచమహా పురుష రాజయోగాలలో ఇదీ ఒకటిగా చెప్తారు. జాతకంలో ఈ యోగం ఉంటే ఆ వ్యక్తి డబ్బుకు సంబంధించిన ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉండదు. ప్రేమ, కుటుంబం, వైవాహిక జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. శుక్రుడు ఒక రాశిలో 24 రోజుల పాటు ఉంటాడు. ఆ తర్వాత 2024 అక్టోబర్ 13వ తేదీ ఆదివారం ఉదయం 06:08 గంటలకు శుక్రుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు.
పితృ పక్షం సెప్టెంబర్ 18న ప్రారంభమై అక్టోబర్ 2 వరకు ఉంటుంది. ఈ రోజున సంవత్సరంలో చివరి, రెండవ చంద్రగ్రహణం భారత కాలమానం ప్రకారం ఉదయం 06:11 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది ఉదయం 10:17 గంటలకు ముగుస్తుంది. ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు, దీని కారణంగా దేశంలో సూతక కాలం నియమాలు చెల్లుబాటు కావు.