భారతదేశ జాతీయ జెండాను ఘోరంగా అవమానించిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఛతర్‌పూర్ ప్రాంతంలో అరాచకవాదులు త్రివర్ణ పతాకంపై అశోక్ చక్రానికి బదులుగా అరబిక్ భాషలో కల్మా అని రాశారు.
ఆ తర్వాత దానిని ఎగురవేశారు. దీంతో విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు ఈ ఘటనపై స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జాతీయ గౌరవాన్ని అవమానించే చట్టం 1971లోని సెక్షన్ 2 కింద కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు ప్రారంభించారు.