చేపల లోడుతో వెళుతున్న కంటైనర్ అదుపుతప్పి రోడ్డుపై తిరగబడిన ఘటన శుక్రవారం ఉంగుటూరు జాతీయ రహదారి పై జరిగింది. నారాయణపురంలో చేపల ప్యాకింగ్ చేసుకొని బయలుదేరిన కంటైనర్ ఉంగుటూరు రోడ్డు పై ఎదురుగా వెళుతున్న టాటా ఏసీ వ్యాన్ను డీ కొీట్టి అదుపుతప్పి రోడ్డుకు అడ్డంగా బోల్తా పడింది.ఆ కంటైనర్ లో డ్రైవర్ తో పాటు 8 మంది జట్టు కూలీలు ఉన్నారు. వారిని స్థానికులు బయటకు తీశారు. ఎనిమిదిమందికి స్వల్ప గాయాలయ్యాయి. పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు ప్రమాద స్థలానికి వచ్చి సహాయకచర్యలు చేపట్టారు.