అంగన్వాడి సమస్యలపై సమస్యలను పరిష్కరించాలని సిఐటియు అధ్యక్షులు వాడ గంగరాజు అన్నారు శుక్రవారం బంగారుపాలెం మండలం లో జరిగిన మంత్రి నారా లోకేష్ పర్వటంలో అంగన్వాడి వర్కర్స్ మంత్రి లోకేష్ ను కలిసి వినతి పత్రం ఇచ్చారు ఈ సందర్భంగా జిల్లా సిఐటియు అధ్యక్షులు వాడ గంగరాజు మాట్లాడుతూ … 2023 డిసెంబర్ 12 నుండి 2024 జనవరి 22 వరకు జరిగిన సమ్మె కాలానికి ఇచ్చిన హామీ మేరకు సమస్యలను పరిష్కరించాలని ప్రధానంగా జూలై నెలలో చర్చిలకు పిలిచి వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారని ఇంతవరకు చర్చలకు పిలవలేదని అంగన్వాడి సమస్యలు వేతనాలు పెంపు రాష్ట్రంలోని మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చడం, ఫ్రీ స్కూల్ బలోపేతం చేయాలని ఫ్రీ స్కూల్ పిల్లలకు తల్లికి వందనం పథకం అమలు చేయాలని ఐదు సంవత్సరాల లోపున్న పిల్లలు గ్రామంలో అంగన్వాడి సెంటర్లో ఉండేలా జీవో విడుదల చేయాలని సర్వీస్ లో ఉండి చనిపోయిన వారికి దాన సంస్కారాలు 20 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేయాలని ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను అంగన్వాడీ వారికి వర్తించే విధంగా చూడాలని సమ్మె కాలంలో పెట్టిన కేసులను కొట్టివేయాలని డిమాండ్ చేశారు.