చొరబాటుదారులే లాలూ యాదవ్ పార్టీ, జేఎంఎం, కాంగ్రెస్ పార్టీల ఓటు బ్యాంకులని కేంద్రమంత్రి అమిత్ షా చెప్పారు. అందుకే అవి పోతాయనే భయంతోనే చొరబాట్లను ఆపరని ఆయన అన్నారు. ఈ మేరకు జార్ఖండ్ లోని సాహిబ్ గంజ్ లో ఆయన మాట్లాడారు.
జార్ఖండ్ లోని సంతాల్ లో చొరబాటుదారుల సంఖ్య పెరుగుతోందని చెప్పారు. దేశంలోనే హేమంత్ సొరెన్ నేతృత్వంలోని ప్రభుత్వం ఎక్కువ అవినీతి చేసిందని తెలిపారు. కాంగ్రెస్ నాయకుడు ధీరజ్ సాహు ఇంట్లో రూ.350 కోట్లు దొరికాయని గుర్తు చేశారు.