విలాసవంత కార్లు కొంటున్న యువత సంఖ్య పెరుగుతోందని మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ సంతోష్ అయ్యర్ వెల్లడించారు. బెంజ్ కార్లను కొంటున్నవారిలో 15% మంది మహిళలే అని తెలిపారు.
బెంజ్ కార్లకు తెలంగాణలో మంచి గిరాకీ ఉంటోందని, తమ మొత్తం విక్రయాల్లో ఇక్కడి వాటా 8-9 శాతమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు 1% వాటా ఉందన్నారు. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో మేబ్యాక్ లాంజ్ ప్రారంభిస్తున్నామని వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa