23 సెప్టెంబర్ నుండి పశ్చిమ రాజస్థాన్, కచ్ ప్రాంతాల నుండి నైరుతి రుతుపవనాల ఉపసంహరణకు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. మరోవైపు సగటు సముద్ర మట్టం వద్ద రుతుపవన ద్రోణి ఇప్పుడు బికనీర్, గుణ, మాండ్లా, రాజ్‌నంద్‌గావ్, గోపాల్‌పూర్ మీదుగా ఆగ్నేయ దిశగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు వెళుతుంది.తూర్పు -పశ్చిమ షియర్ జోన్‌తో అనుసంధానించబడి, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతం ప్రాంతాలపై నున్న శుక్రవారం నాటి ఉపరితల ఆవర్తనం శనివారం పశ్చిమ మధ్య బంగాళాఖాత ప్రాంతములో మధ్య ట్రోపోఆవరణము వరకు విస్తరించి ఉంది.
మరో ఉపరితల ఆవర్తనం ఉత్తర థాయ్ లాండ్ పరిసర ప్రాంతాలపై ఏర్పడి మధ్య ట్రోపో ఆవరణం వరకు విస్తరించి ఉంది. తరువాత ఈ ఉపరితల ఆవర్తనం పశ్చిమ వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉంది. పై రెండు ఉపరితల ఆవర్తనాలు ప్రభావంతో, 23 సెప్టెంబర్ 2024 నాటికి వాయువ్య & ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది. ఈ క్రమంలో .. రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు తెలుసుకుందాం…
శనివారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది