శింగనమల నియోజకవర్గం,గార్లదిన్నె మండలం,పెనకచెర్ల డ్యాం నుండి మిడ్ పెన్నార్ సౌత్ కెనాల్ కు అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ గారు మరియు నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ నీటిని విడుదల చేసి అనంతరం గంగమ్మకు చీరను సమర్పించి పూజలు నిర్వహించారు.గత 2 నెలల నుండి ఇర్రిగేషన్ అధికారులతో నియోజవర్గ నీటి సమస్యల మీద అనేక సమావేశాలు నిర్వహించి,ఇటీవల జిల్లా కలెక్టర్ కార్యాలయం లో జరిగిన నీటి పారుదల సమావేశంలో నియోజకవర్గ నీటి సమస్యలను మంత్రి పయ్యావుల కేశవ్ గారు మరియు మంత్రి సత్య కుమార్ గారి దృష్టికి తీసుకెళ్లి,కేటాయించిన తేదికంటే 10 రోజులు ముందే నీటి విడుదల చేసి ఇచ్చిన హామీని నెరవేర్చి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మాటను నిలబెట్టుకుందని ఎమ్మెల్యే గారు సంతోషం వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వ హయాంలో ఆన్ అండ్ ఆఫ్ లో నీటి పారుదల ఉండేది, కూటమి ప్రభుత్వ హయాంలో 130 రోజులు ఒకే విధంగా నీటి సరఫరా ఉంటుందని ఎమ్మెల్యే శ్రావణి తెలిపారు.యువగలం పాదయాత్ర ఇదే గార్లదిన్నె మండలంలో జరిగినప్పుడు యువ నాయకుడు నారా లోకేష్ కి మిడ్ పెన్నర్ డ్యాం సమస్యలు కూడా తీసుకువెళ్ళం, అయన ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని శింగనమల నియోజకవర్గానికి త్వరగా నీటిని విడుదల చేయడానికి తోడ్పడ్డారని తెలిపారు.విడుదల చేసిన నీరు నియోకవర్గంలోని దక్షిణ ఆయకట్టు కాలువ కింద దాదాపు 33,700 ఎకరాల లో పంటల సాగుకు తోడ్పాడుతుందని ఎమ్మెల్యే శ్రావణి తెలిపారు.గత ప్రభుత్వం లో డ్యాం గేట్లు మరమ్మతులు చేయకపోవడంతో 200 క్యూసెక్కుల నీరు వృధాగా పోయిందని,కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 10 లక్షల రూపాయల ఖర్చు పెట్టి,గేట్లు మరమ్మతులు చేసి,నీరు విడుదల చేసామని ఎమ్మెల్యే శ్రావణి గారు తెలిపారు.