తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో పిల్స్ దాఖలయ్యాయి. టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, సుబ్రహణ్యస్వామి వేర్వేరుగా పిల్స్ దాఖలు చేశారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలపై విచారణ చేయాలని సుబ్రహ్మణ్యస్వామి విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలని స్వామి కోరారు. విచారణ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో గానీ, నిపుణులతో గానీ విచారణ చేయించాలని వైవీ సుబ్బారెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు. మరోవైపు... తిరుమల లడ్డూపై వివాదం కొనసాగుతుండగా గత టీటీడీ పాలకమండలి నిర్ణయాలపై ఏపీ సర్కార్ విచారణకు ఆదేశించింది.
దీంతో ఛైర్మన్ హోదాలో తీసుకున్న నిర్ణయాలపై వివరణ ఇవ్వాలని వైవీ సుబ్బారెడ్డిని విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెవంట్ ఎస్సీ కోరారు. దీంతో వైవీ సుబ్బారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. టీటీడీ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికారం రాష్ట్ర విజిలెన్స్ విభాగానికి లేదని, టీటీడీకి స్వయం ప్రతిపత్తి ఉందని, అంతర్గత విషయాలపై విచారణ చేసేందుకు టీటీడీకీ సొంత విజిలెన్స్ విభాగం ఉందన్నారు. విజిలెన్స్ విచారణ రద్దు చేయాలంటూ సుబ్బారెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు.