శ్రీకాకుళం జిల్లా, రణస్థలం మండల కేంద్రంలోని గోవధకు పాల్పడిన మహ్మద్ సమీర్‌పై కేసు నమోదు చేసినట్టు జేఆర్ పురం ఎస్‌ఐ చిరంజివి తెలిపారు. ఆదివారం ఉదయం మండల కేంద్రానికి సమీపాన ఒక తోటలో ఆవులను వధించి, ఆ మాంసాన్ని విక్రయిస్తున్న సమీర్‌ను పోలీసులు పట్టుకున్నారు. అక్కడ ఉన్న మూడు ఆవులను గోశాలకు తరలించి, గోవధకు పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు. ఎవరైనా గోవధకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa